BSNL to launch 5G in Select Cities : last 2024లో ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచడంతో.. చాలా మంది కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కీ మారారు. 2024 జూలై, సెప్టెంబర్ నెలల్లో లక్షల మంది ఒక్కసారిగా BSNL నెట్‌వర్క్‌కి షిఫ్ట్ కావడం విశేషం.
మీ వయస్సు 30-45 మధ్య ఉందా? మీ కోసం ఉత్తమ టర్మ్ ప్లాన్
BSNL 5G Select Cities Rollout : భారతీయ టెలికాం సంస్థ BSNL దేశంలో 5G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. June నుంచి 5జీ సేవలను విస్తరించనున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రకటించారు. ఇదే సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNL 5G విస్తరణ ఈ సంవత్సరం జూన్ నాటికి ప్రారంభమవుతుందని తెలుపగా.. చాలా మంది యూజర్లు ఎక్కడ మొదట ఈ సేవలు ప్రారంభమవుతాయనే ఆసక్తితో ఉన్నారు. ఈ విషయం లో BSNL 5జీ నెట్‌వర్క్ గురించి పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
బి ఎస్ ఎన్ ల్ 5G సేవలు మొదట ఢిల్లీలో ప్రారంభం కానున్నాయి. ఈ నెట్‌వర్క్ యాజ్ ఎ సర్వీస్ (NaaS) మోడల్‌ను ఉపయోగించి, కంపెనీ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. న్యూ ఢిల్లీ తర్వాత.. చాలా నగరాలకు ఈ సేవలను విస్తరించడానికి సంస్థ సిద్ధంగా ఉన్నట్లు అధికారుల సమచారం.ఈ year 5G సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, వినియోగదారులు వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, మెరుగైన డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్, అధిక నాణ్యత గల కాల్స్ వంటి అనేక ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ సమయంలో BSNL ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడుతుందని కూడా బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.భారతీయ ప్రభుత్వ మద్దతు కూడా భారీస్థాయిలోనే..ఈ
BSNL సంస్థను పునరుజ్జీవింపజేయడానికి ప్రభుత్వం గత సంవత్సరం బడ్జెట్‌లో రూ. 80,000 కోట్లకు పైగా కేటాయించింది. Ee నిధులు BSNL సామర్థ్యాలను పెంపొందించడానికి, నూతన సాంకేతికతలను అందించడానికి, వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి ఉపయోగించనున్నారు. ఇలాంటి చర్యలు BSNL భవిష్యత్తుకు కొత్త మార్గాలను అందించనున్నాయి. ఇప్పుడూన మార్కెట్ పరిస్థితుల్లో వినియోగదారులు వేగవంతమైన, నాణ్యమైన సేవలను కోరుకుంటున్నారు. ఇపుడు BSNL 5G సేవలు కూడా అందుబాటులోకి వస్తే.. చాలా మంది ఈ సేవలపై ఆసక్తి చూపనున్నారు.2024 జూలైలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచడంతో చాలామంది BSNL నెట్‌వర్క్‌కి మారారు.2024 జూలై, సెప్టెంబర్ నెలల్లో లక్షల మంది ఒక్కసారిగా BSNLకి మారారు.ఇపుడు BSNL రీఛార్జ్ ప్లాన్స్ ప్రైవేట్ కంపెనీల కంటే తక్కువ ధరలో ఉంటాయి. ఇపుడే రీఛార్జ్ ధరలు పెంచే ఆలోచనలో BSNL లేదు.ఇపుడు 4G నెట్‌వర్క్ నుంచి 5G సేవలు తెస్తే BSNL నెట్‌వర్క్‌కి మరింత మంది మారే అవకాశం ఉంది.